Pawan Kalyan: విజయ్ సినిమాని రీమేక్ చేయబోతున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది...

admin1
Updated on: 28 Feb 2022 12:20 PM IST
Pawan Kalyan Going to Remake Vijay Theri Movie in Telugu | Tollywood Latest Updates
X

Pawan Kalyan: విజయ్ సినిమాని రీమేక్ చేయబోతున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "భీమ్లా నాయక్" సినిమా ఈ మధ్యనే థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యాప్పనుం కోషియిం" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా బాగా వచ్చింది అంటూ అభిమానులు సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

అయితే దీనికి ముందు పవన్ కళ్యాణ్ నటించిన "వకీల్ సాబ్" కూడా హిందీలో సూపర్ హిట్టయిన "పింక్" సినిమాకి రీమేక్. తాజాగా పవన్ "వినొదయ సీతం" ఒక సినిమాని రీమేక్ చేసేందుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఇప్పుడు తమిళ్ లో సూపర్ హిట్ అయిన, విజయ్ హీరోగా నటించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారిన "తెరి" ను రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ "సాహో" సినిమాకి దర్శకత్వం వహించిన సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కాకుండా మరో వైపు పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో "హరి హర వీర మల్లు" తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story