Pawan Kalyan: కొత్త అమ్మాయితో రొమాన్స్ చేయబోతున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: తాజా సమాచారం ప్రకారం చాలా కాలం తర్వాత ఒక కొత్త అమ్మాయి పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కనిపించబోతోందట

admin1
Updated on: 27 Oct 2021 6:48 PM IST
Pawan Kalyan Going to be Act with Sakshi Vaidya
X
పవన్ కళ్యాణ్ తో కలసి నటించనున్న సాక్షి వైద్య (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: నిజానికి స్టార్ హీరోలు ఎప్పుడు స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కాని కొత్త హీరోయిన్లతో చేయడానికి అంతగా ఆసక్తి చూపించరు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కొత్త హీరోయిన్ ల తో నటించడం చాలా అరుదు. "పంజా" మూవీలో సారా జేన్ డయాస్ తెలుగు ప్రేక్షకులకి కొత్త అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్లో ఆమెకి అప్పటికే మంచి పేరు ఉంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ కొత్త హీరోయిన్ తో నటించింది లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం చాలా కాలం తర్వాత ఒక కొత్త అమ్మాయి పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కనిపించబోతోందట. ఆమె సాక్షి వైద్య. మోడల్ గా తన కెరియర్ ను మొదలు పెట్టిన సాక్షి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా ఎంపిక అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సాక్షి వైద్య ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న "ఏజెంట్" సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా కనిపించనుంది. అయితే "ఏజెంట్" సినిమా లో సాక్షి నటన చూసి ఇంప్రెస్ అయ్యి సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా ఈమె ని హీరోయిన్ గా ఎంపిక చేశారా లేక ఆమె పవన్ కళ్యాణ్ పక్కన బాగుంటుందని ఎంచుకున్నారా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. మరో వైపు పవన్ కళ్యాణ్ అంత చిన్న అమ్మాయి తో రొమాన్స్ చేయడానికి ఒప్పుకుంటారా అని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు.

admin1

admin1

Next Story