Coronavirus: క్వారంటైన్‌లో పవన్ కళ్యాణ్.. ఆందోళనలో ఫ్యాన్స్

Coronavirus: పవన్ వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్

Sandeep Eggoju
Published on: 11 April 2021 1:42 PM IST
Pawan Kalyan Goes To Self Isolation
X

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాన్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. పవన్ వ్యక్తిగత భద్రత సిబ్బంది కరోనా బారిన పడ్డారు.. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో పవన్ క్వారంటైన్‌కు వెళ్లారు. గత వారం రోజులుగా ఆయన సిబ్బందిలో ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా దగ్గరగా విధులు నిర్వహిస్తారని.. దాంతో ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్‌కు వెళ్లినట్టు జనసేన పార్టీ ప్రకటించింది. అయితే. ఆయన రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నట్టు వెల్లడించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story