హరీష్ శంకర్ కు క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఈ మధ్యనే "వకీల్ సాబ్", "భీమ్లా నాయక్" సినిమా లతో సూపర్ హిట్లు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు "హరిహర వీరమల్లు" సినిమాతో బిజీగా ఉన్నారు.

Arun Chilukuri
Updated on: 20 April 2022 8:00 PM IST
Pawan Kalyan Gives Clarity to Harish Shankar
X

హరీష్ శంకర్ కు క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఈ మధ్యనే "వకీల్ సాబ్", "భీమ్లా నాయక్" సినిమా లతో సూపర్ హిట్లు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు "హరిహర వీరమల్లు" సినిమాతో బిజీగా ఉన్నారు. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీ కాబోతున్నారు. "హరిహర వీరమల్లు" సినిమా పూర్తయిన తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో చేస్తున్న సినిమాని పట్టాలెక్కించబోతున్నారు. ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను పలుసార్లు కలిసిన హరీష్ శంకర్ డేట్లు ఇస్తారా లేక మరో సినిమా పూర్తి చేసుకొని రమ్మంటారా అని సున్నితంగా అడగగా పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు అని టాక్ నడుస్తోంది. ఆ పాత్రల కోసం హీరోయిన్లను వెతికే పనిలో పడ్డారు హరీష్ శంకర్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయిపోయాయి. ఇక సినిమా మొదలు పెట్టడం ఒకటే తరువాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story