బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు పవన్‌కల్యాణ్ గిఫ్ట్

Pawan Kalyan: హరిహర వీరమల్లు పవర్ఫుల్ పవర్ గ్లాన్స్

Jyothi
Published on: 2 Sept 2022 12:34 PM IST
Pawan Kalyan Gift to Fans on His Birthday
X

బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు పవన్‌కల్యాణ్ గిఫ్ట్

Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా... నిధి అగర్వాల్ హీరోయిన్‌గా...దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం.... ఇప్పుడు అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతుంది. అయితే ఇవాళ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ బర్త్‌డే కానుకగా మేకర్స్ ఓ భారీ ట్రీట్‌ను ప్లాన్ చేశారు. అదిరిపోయే పవర్ గ్లాన్స్‌ పేరుతో చిత్ర యూనిట్ టీజర్‌ను రిలీజ్ చేసింది. వీడియో నెక్ట్స్ లెవల్లో ఉందంటున్నారు పవన్ ఫ్యాన్స్. వారియర్‌గా పవన్ ని ఫస్ట్ టైం చూడబోతున్న సినిమా ఇది కావడంతో ఆసక్తి ఎక్కువగా ఉంది. మల్లయోధులని పడగొట్టి.. తొడగొట్టి మీసం మెలేసిన రాజసంతో పవన్ ఫ్యాన్స్ కి... వీరమల్లు పవర్ గ్లాన్స్ ఓ అదిరే ట్రీట్.

Jyothi

Jyothi

Next Story