Pawan Kalyan: ఫైనల్ గా ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ కి డేట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఎట్టకేలకి సినిమా మొదలుపెట్టనున్న పవన్ కళ్యాణ్

Dhatripriya
Updated on: 25 March 2023 9:30 PM IST
Pawan Kalyan Gave Dates To Popular Production Banner
X

Pawan Kalyan: ఫైనల్ గా ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ కి డేట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ అందులో ఒకటి కూడా విడుదలకి సిద్ధం అవ్వడం లేదు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా కోసం 2019 ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ కి కొంత అడ్వాన్స్ అమౌంట్ కూడా ఇచ్చేశారు నిర్మాతలు. కానీ ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కానీ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా లేదు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సినిమా కోసం డేట్ లు కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా స్క్రిప్టులు రిజెక్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ చెప్పిన "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాకి ఓకే చెప్పారు. తమిళ్లో సూపర్ హిట్ అయిన "తేరీ" సినిమాకి ఈ చిత్రం రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 5 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుబోతోందని తెలుస్తోంది. 20 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ జరగబోతుందట. పవన్ కళ్యాణ్ కూడా ఈ షూటింగ్ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారు.

ఈసారి ఈ షూటింగ్ షెడ్యూల్ ఎలాంటి పరిస్థితుల్లోనూ క్యాన్సల్ అవ్వదని తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" సినిమా షూటింగ్ ను పక్కన పెట్టి "వినోదయ సితం" తెలుగు రీమేక్ షూటింగ్ కూడా మొదలుపెట్టేసారు. త్వరలోనే సుజిత్ దర్శకత్వంలో "ఓ జి" సినిమాకి కూడా డేట్లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. చూస్తూ ఉంటే వచ్చే ఏడాది ఎన్నికల కంటే ముందే పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాలు అన్నిటిని పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

Dhatripriya

Dhatripriya

Next Story