Pawan Kalyan - Mogulaiah: పవన్ మెచ్చిన కిన్నెరుడు.. మొగులయ్యకు పవన్ ఆర్థిక సాయం

* కిన్నెర మొగులయ్య తాజాగా "భీమ్లా నాయక్" సినిమాలోని టైటిల్ సాంగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

Sandeep Reddy
Updated on: 4 Sept 2021 3:02 PM IST
Pawan Kalyan Gave 2 Lakh Rupees to Kinnera Mogulaiah For Financial Help
X

పవన్ మెచ్చిన కిన్నెరుడు (ఫైల్ ఫోటో)

Pawan Kalyan - Kinnera Mogulaiah: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య ఊరూర తిరుగుతూ కిన్నెర వాయించేవాడు. ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించే కిన్నెర మొగులయ్య తాజాగా "భీమ్లా నాయక్" సినిమాలోని టైటిల్ సాంగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 12 మెట్ల కిన్నెర వాయించే అతి తక్కువ వ్యక్తులలో ఒకరైన మొగులయ్యను గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం గతంలో సత్కరించింది.

తాజాగా "భీమ్లా నాయక్" టైటిల్ సాంగ్, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మొగులయ్య పవన్ కళ్యాణ్ తన పాటకి శభాష్ అన్నాడని, ఈ పాటతో తనకు వందల ఫోన్స్ వస్తున్నాయని.. పవన్ కళ్యాణ్ చాలా మంచోడని చెప్పుకొచ్చాడు. గతంలో నావద్ద అయిదు వేల రూపాయలు లేక తన భార్యని కాపాడుకోలేకపోయానని తన బాధని తెలిపాడు. తాజాగా కిన్నెరతో ఆకట్టుకున్న మొగులయ్యకు పవర్ స్టార్ రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం చేసి మరోసారి పవన్ కళ్యాణ్ కళాకారులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారితో మరో పాట కూడా చేయాలని ఉందని, ఈ పాటతో మన పాలమూరు జిల్లాకు మంచిపేరు తెచ్చానని మొగులయ్య తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story