Pawan Kalyan: తమిళ్ డైరెక్టర్ తో చేతులు కలపనున్న పవర్ స్టార్

Pawan Kalyan: తమిళ్ డైరెక్టర్ తో చేతులు కలపనున్న పవర్ స్టార్

Rama Rao
Updated on: 16 Feb 2022 1:00 PM IST
Pawan Kalyan Film With Tamil Director | Tollywood News
X

తమిళ్ డైరెక్టర్ తో చేతులు కలపనున్న పవర్ స్టార్

Pawan Kalyan: ఈ మధ్యనే "వకీల్ సాబ్" తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు "భీమ్లా నాయక్" సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ మరిన్ని సినిమాలు సైన్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే తన చేతుల్లో ప్రాజెక్టులు ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు ఒక తమిళ డైరెక్టర్ తో చేతులు కలుపుతున్నారు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు త్వరలో విడుదల కాబోతున్న "వాలిమై" సినిమాకి దర్శకత్వం వహిస్తున్న హెచ్ వినోద్.

అజిత్ హీరోగా నటిస్తున్న "వాలిమై" సినిమా తమిళంలోనే కాక తెలుగులో కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే దీపావళి సందర్భంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈసినిమా తర్వాత వినోద్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు హెచ్ వినోద్ డైరెక్ట్ చేసిన తమిళ సినిమా "నేర్కొండ పార్వై" బాలీవుడ్ లో "పింక్" సినిమాకి రీమేక్ గా విడుదలైంది. అదే "పింక్" సినిమాని పవన్ కళ్యాణ్ కూడా "వకీల్ సాబ్" గా తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rama Rao

Rama Rao

Next Story