ఆనంద్‌సాయిని సత్కరించిన పవన్‌కల్యాణ్

Arun Chilukuri
Published on: 17 Oct 2020 9:50 AM IST
ఆనంద్‌సాయిని సత్కరించిన పవన్‌కల్యాణ్
X

ధార్మికరత్న పురస్కారం అందుకున్న యాదాద్రి ఆలయ ముఖ్య అర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకులు శ్రీ ఆనందసాయిని అభినందించారు జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్. ఇటీవలే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి చేతులమీదుగా ధార్మికరత్న పురస్కారాన్ని ఆనంద్‌సాయి అందుకున్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో శాలువాతో సత్కరించారు పవన్‌కల్యాణ్. శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం అన్నారు పవన్. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకి పురస్కారం దక్కడం సముచితమన్నారు. కార్యక్రమంలో నటుడు నర్రా శ్రీను పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story