Vakeel Saab: తిరుపతిలో పవన్‌ ఫ్యాన్స్ వీరంగం

Vakeel Saab: పవన్ ‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చాడు. ‘వకీల్‌సాబ్‌’ గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Venkata Chari
Published on: 9 April 2021 8:54 AM IST
Pawan Kalyan Fans Halchal in Tirupathi
X
తిరుపతిలో శాంతి థియేటర్ వద్ద ష్యాన్స్ వీరంగం (ఫొటో ట్విట్టర్)

Vakeel Saab: పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చాడు. మూడేళ్ల తరువాత'వకీల్‌సాబ్‌' గా ఈ రోజు (ఏప్రిల్‌ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 700కు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలయ్యింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. కోవిడ్-19 తర్వాత టాలీవుడ్ లో విడుదలవుతోన్న భారీ చిత్రం వకీల్ సాబే కావడం విశేషం.

ఈ క్రమంలో బెనిఫిట్ షోలను కూడా ఏర్పాటు చేశారు. అయితే తిరుపతిలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన బెనిఫిట్‌ షోలను రద్దు చేశారు. దీంతో పవన్‌ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. తిరుపతిలోని శాంతి థియేటర్‌పై రాళ్లతో దాడి చేశారు. దీంతో థియేటర్‌ వద్ద అర్థరాత్రి గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఫ్యాన్స్‌ను చెదరగొట్టారు.

Venkata Chari

Venkata Chari

Next Story