RGV - Pawan Kalyan Fans: ఆర్జీవీ వర్సెస్ పవర్‌ స్టార్‌ అభిమానులు

RGV - Pawan Kalyan Fans: పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను టార్గెట్‌ చేస్తూ ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశాడు.

Kranthi
Published on: 17 April 2021 12:17 PM IST
Pawan Kalyan Fans Fires on RGV | RGC Tweet on Pawan Kalyan
X

Pawan Kalyan: (ట్విట్టర్ ఇమేజ్)

RGV - Pawan Kalyan Fans: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కరోనాకు సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరినీ ఓ ఆట ఆడేసుకుంటోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి అనేక మంది ఆ మహమ్మారి బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. పవన్‌ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా సోకడంతో ఆయన పరీక్ష చేయించుకున్నారు. దీంతో పాజిటివ్‌ అని తేలింది. పవన్‌ ప్రస్తుతం తన ఫామ్‌హౌజ్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పవన్‌ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా సంచలన డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ కూడా ట్విట్టర్‌ వేదికగా కొన్ని పోస్టులు చేశారు. దీంతో పవన్‌ అభిమానులు వర్మపై మాటల దాడికి దిగారు. అయితే పోస్ట్‌ చేస్తే మాటల దాడికి దిగడం ఏంటనీ ఆలోచిస్తున్నారు కదూ.. అందరిలా కామెంట్ చేస్తే తాను వర్మ ఎందుకు అవుతాడు చెప్పండి. ఈసారి కూడా వర్మ.. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను టార్గెట్‌ చేస్తూ కొన్ని వరుస ట్వీట్లు చే శారు. దీంతో ప్రస్తుతం ట్విట్టర్‌ వేదికగా పవన్‌ ఫ్యాన్స్‌ వర్సెస్‌ ఆర్‌జీవీ అన్నట్లు మారింది. ఇంతకీ వర్మ చేసిన పోస్ట్‌ ఏంటనేగా… పవన్‌ కళ్యాణ్‌ బెడ్‌పై రెస్ట్‌ తీసుకుంటున్న సమయంలో తీసిన ఫొటోను పోస్ట్‌ చేసిన వర్మ.. 'పవన్ కళ్యాణ్ అభిమానులు.. వెంటనే ఆ వైరస్ లను పచ్చడి పచ్చడి చేసి చంపేయండి'. అంటూ ట్వీట్‌ చేశాడు.

ఒక కనిపించని పురుగు పవన్ కల్యాణ్‌ను ఇలాంటి దయనీయస్థితిలో పడుకోబెట్టేసిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా? లేనట్టా? చెప్పండి యువరానర్? అని ప్రశ్నించిన వర్మ, మరో ట్వీట్‌లో.. వేరే హీరో ఫ్యాన్స్ మాత్రం పవన్ ఇలా మంచాన పడడానికి కారణం కొవిడ్ కాదని, వకీల్ సాబ్ వసూళ్లు అని అంటున్నారని, అందరూ కదిలి ప్రాణాలకు తెగించి పీకే జేబుల్ని నింపండి అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశాడు.

'ఫేక్' ఏమిటో చెప్పాలని, ఆ తప్పును బయటపెట్టిన వారి ఫొటోను తాను పోస్టు చేసి రివార్డు కూడా ఇస్తానని వర్మ ఆఫర్ చేశాడు. ఆర్ట్ డైరెక్షన్‌లో ఒక తప్పుందని, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్‌ను అడిగైనా సరే ఆ తప్పేంటో చెప్పించాలని రాజమౌళిని కూడా కోరాడు. నిజానికి 'ఫేక్' అని తాను అనడం లేదని, వేరే హీరోల దగుల్బాజీ ఫ్యాన్స్ అంటున్నారని, వారి ఆట కట్టించేందుకు పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా తాను ఈ చాలెంజ్ విసిరానని పేర్కొన్నాడు. దీంతో పవన్‌ అభిమానులు వర్మపై మండిపడుతున్నారు.



Kranthi

Kranthi

Next Story