Dil Raju Comments: దిల్ రాజు పై మండిపడుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు

* విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు

admin1
Updated on: 21 Oct 2021 1:16 PM IST
Pawan Kalyan Fans Fires on Dil Raju in Social Media
X

దిల్ రాజు పై మండిపడుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు (ఫైల్ ఫోటో)

Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ హీరోగా టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. "రౌడీ బాయ్స్" అనే ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాతో ఆశిష్ తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. నిజానికి రౌడీ బాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కి సంబంధించిన ఒక ఈవెంట్ కి విజయ్ దేవరకొండ ని ముఖ్య అతిథిగా పిలిచారు. దిల్ రాజు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తొందర్లోనే దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.

అయితే మరోవైపు దిల్ రాజు చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు. "నాలుగు సినిమాల తోనే పవన్ కళ్యాణ్ కు ఉన్నంత ఫాలోయింగ్ వచ్చింది విజయ్ దేవరకొండ కి". దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఏమనుకున్నా సరే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం దిల్ రాజు పై మండి పడుతున్నారు. ఇక ఈ మధ్యనే "వరల్డ్ ఫేమస్ లవర్" అనే సినిమా లో కనిపించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు హర్ష, ఆశిష్ మరియు అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన "రౌడీ బాయ్స్" సినిమా నవంబర్ 19న విడుదల కాబోతోంది.

admin1

admin1

Next Story