Pawan Kalyan Fans: రోజురోజుకీ ప్రెజర్ పెంచుతున్న పవర్ స్టార్ అభిమానులు.. అందుకేనా..

Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ అభిమానుల వల్ల చిత్ర బృందానికి రోజురోజుకీ ప్రెజర్ పెరుగుతూ వస్తోంది...

admin1
Updated on: 5 Jan 2022 1:11 PM IST
Pawan Kalyan Fans Fires on Bheemla Nayak Movie Producers for Late | Tollywood News
X

Pawan Kalyan Fans: రోజురోజుకీ ప్రెజర్ పెంచుతున్న పవర్ స్టార్ అభిమానులు.. అందుకేనా..

Pawan Kalyan Fans: డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానుల వల్ల చిత్ర బృందానికి రోజురోజుకీ ప్రెజర్ పెరుగుతూ వస్తోంది. సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు మీద కామెంట్లు చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. కానీ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా విడుదల కాబోతుండటంతో "భీమ్లా నాయక్" ని చిత్ర నిర్మాత వంశీ సంక్రాంతి బరిలో నుండి తప్పించారు.

అయితే తాజాగా ఇప్పుడు పెరుగుతున్న కరోనా కేసుల వల్ల "ఆర్ ఆర్ ఆర్" సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలో "భీమ్లా నాయక్" సినిమాని అంతకు ముందు అనుకున్న విధంగా సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాల్సింది అంటూ అభిమానులు నిర్మాతలపై మండిపడుతున్నారు.

సినిమా ఏదైనా కరోనా కారణంగా రాష్ట్రాలు మళ్ళీ మూత పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఏ సినిమా విడుదల చేసినా సరే కలెక్షన్లు అంతగా రాకపోవచ్చు. పైగా ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు కూడా ఇంకా తక్కువగానే ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని వాయిదా వేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ విషయంలో అభిమానులు కూడా అర్థం చేసుకొని కొన్నాళ్ళు ఓపిక పడితే బాగుంటుందని నిర్మాతలు చెబుతున్నారు.

admin1

admin1

Next Story