బండ్ల గణేష్ పై విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

* "కనీసం సగం రెమ్యూనరేషన్ అయినా ఇచ్చావా," అంటూ నిలదీస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

Dhatripriya
Updated on: 6 Feb 2023 8:01 AM IST
Pawan Kalyan Fans Are Raving About Bandla Ganesh
X

బండ్ల గణేష్ పై విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

Pawan Kalyan: ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న "అన్ స్టాపబుల్" సెలబ్రిటీ టాక్ షో కి గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అయితే తొలిప్రేమ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోలేదు అని బాలకృష్ణ అడగగా దానికి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఏమి ఇవ్వలేదని కానీ సినిమా హిట్ అయ్యాక మాత్రం ఇచ్చారని అన్నారు పవన్ కళ్యాణ్.

"కనీసం గబ్బర్ సింగ్ కైనా ఇచ్చారా" అని బాలయ్య అడగగా దానికి పవన్ కళ్యాణ్ "తాను అనుకున్నంత ఇవ్వలేదు కానీ నిర్మాత అనుకున్నంత ఇచ్చారు," అని అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు బండ్ల గణేష్ పై విరుచుకుపడుతున్నారు. "పరమేశ్వర.. పవనేశ్వర.. అంటూ రెమ్యునరేషన్ కి బొక్క పెట్టావా? అందరూ అతి చేసి బొక్క పెట్టే వాళ్లే," అని ఒకరు సోషల్ మీడియాలో కామెంట్ చేయగా, "కనీసం సగం రెమ్యూనరేషన్ అయినా ఇచ్చావా?" అంటూ మరొకరు కామెంట్ చేశారు.

ఇలా పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ అని చెప్పుకుంటూ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ కి హ్యాండ్ ఇచ్చారు అంటూ పవన్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దీంతో ఒక బండ్ల గణేష్ కూడా సోషల్ మీడియా ద్వారా వారికి రిప్లై ఇస్తున్నారు. "తెలిసి తెలియకుండా మాట్లాడకు ఎర్రి....!" అంటూ బండ్ల గణేష్ కూడా ఆ కామెంట్లకు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

Dhatripriya

Dhatripriya

Next Story