Pawan Kalyan: మేజర్‌ చిత్రబృందానికి పవన్‌ అభినందనలు

Pawan Kalyan: మేజర్‌ ఉన్నికృష్ణన్ బయోపిక్‌ తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందదాయకం

Rama Rao
Updated on: 12 Jun 2022 6:30 PM IST
Pawan Kalyan Congratulates the Major film Team | Tollywood News
X

Pawan Kalyan: మేజర్‌ చిత్రబృందానికి పవన్‌ అభినందనలు

Pawan Kalyan: మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ సాహసాలు, ఆయన వీరమరణాన్ని వెండి తెరపై మేజర్‌గా ఆవిష్కరించిన చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. అడివి శేష్ లాంటి నటులు మరింత మంది చిత్రసీమకు రావాలని అన్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలుసుకొని సంతోషించానని, అన్ని భాషలవారినీ మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందం కలిగించిందన్నారు పవన్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి సైనికాధికారులు, సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలన్నారు. ఇంకా మేజర్‌ సినిమా చూడలేదని, త్వరలోనే వీక్షిస్తానని చెప్పారు జనసేనాని.



Rama Rao

Rama Rao

Next Story