Pawan Kalyan: కృష్ణంరాజు మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది

Pawan Kalyan: మా కుటుంబానికి మంచి స్నేహం ఉందన్న పవన్‌ కల్యణ్

Jyothi
Published on: 11 Sept 2022 11:45 AM IST
Pawan Kalyan Condolences To Krishnam Raju Death
X

Pawan Kalyan: కృష్ణంరాజు మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది

Pawan Kalyan: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథా కలిగిన నటుడు కృష్ణంరాజు అని.. ఆయన తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రల్లో ఎంతగా మెప్పించేవారో.. కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ కృష్ణంరాజు అలాగే ఒదిగిపోయేవారని కొనియాడారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

''నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నేతగా అందరి మన్ననలు పొందిన కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవల ఆయన అస్వస్థతకు లోనయ్యారనే విషయం తెలిసినపుడు కోలుకుంటారనే భావించారు. మా కుటుంబంతో కృష్ణంరాజుకు స్నేహసంబంధాలు ఉన్నాయి.

ప్రజాజీవితంలోనూ కృష్ణంరాజు ఎంతో హుందాగా మెలిగారు. కేంద్రమంత్రిగానూ సేవలందించారు. ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరఫున బరిలో నిలిచారు. సినీ జీవితంలోనూ, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణంరాజు కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను'' అని పవన్‌ పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story