Pawan Kalyan: జగన్ అధికారంలో ఉంటే ఒక రూల్.. లేకపోతే ఒక రూలా?

Pawan Kalyan: చంద్రబాబు రోడ్ షోను అడ్డుకోవడంపై విమర్శలు

Jyothi
Updated on: 5 Jan 2023 8:38 AM IST
Pawan Kalyan Comments On Jagan
X

Pawan Kalyan: జగన్ అధికారంలో ఉంటే ఒక రూల్.. లేకపోతే ఒక రూలా?

Pawan Kalyan: కుప్పంలో చంద్రబాబు రోడ్ షోను పోలీసులు అడ్డుకోవడంపై జనసేన అధక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు, ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదనే ఉద్దేశంతోనే జీవో నెంబర్ 1 ని తీసుకొచ్చారని ఆయన ఫైర్ అయ్యారు. ఇటువంటి జీవో గతంలోనే ఉండి ఉంటే జగన్ రెడ్డి నాడు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేయగలిగేవారా ? అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు అమలు చేస్తుంటే ప్రజా పక్షం వహించడం ప్రతిపక్ష పార్టీలుగా మా బాధ్యత అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తుచేశారు. ఇలాంటి చీకటి ఉత్త్వరులు ఇవ్వకుండానే అందులోని దురుద్దేశాలను అక్టోబరులోనే విశాఖ నగరంలో చూపించారని చెబుతూ అక్టోబర్‌లో విశాఖలో జరిగిన ఘటనల గురించి పవన్ కళ్యాణ్ మరోసారి గుర్తుచేసుకున్నారు. వాహనంలో నుంచి కనిపించకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు అని, హోటల్ నుంచి బయటకు రాకూడదు అని నిర్బంధాలు విధించారు. ఇప్పటం వెళ్లరాదని అటకాయించారు. అప్పుడు జీవో లేకుండానే చేసిన పనిని చేయడానికి ఇప్పుడు ఏకంగా జీవోనే తీసుకువచ్చారంటూ ఏపీ ప్రభుత్వం తీరుపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

































Jyothi

Jyothi

Next Story