పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తారా?

Ruthvik
Published on: 18 April 2019 5:31 PM IST
పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తారా?
X

'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి కేవలం రాజకీయాల మీద మాత్రమే దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక సినిమాలు చేయను అని పవన్ కల్యాణ్ డైరెక్ట్ గానే మీడియాతో చెప్పారు. కానీ గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కు మళ్లీ సినిమాలపై మనసు మళ్ళిందని ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిద్దామని పవన్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు బయటకు వస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చే ముందు చాలా మంది నిర్మాతల దగ్గర పవన్ కళ్యాణ్ అడ్వాన్సు తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాక వారికి తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు అభిమానులు కూడా 'అజ్ఞాతవాసి' సినిమా డిజాస్టర్ కావడంతో కనీసం ఒక్క సినిమాతో హిట్ ఇచ్చి తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళమని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం కొన్ని కథలు రెడీ అవుతున్నాయని వాటిలో పవన్ కళ్యాణ్ నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ క్యాంప్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ అభిమానులు మాత్రం సంతోష పడిపోతున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే చెప్పాలి.

Ruthvik

Ruthvik

Next Story