Pawan Kalyan Bro: బ్రో పవన్ టైం మొదలైంది..

* ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు పవన్ రెండు పడవల పై దూసుకెళ్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్, OG అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన పవన్ తాజాగా PKSDT టైటిల్ ను అనౌన్స్ చేసుకున్నాడు.

Dhatripriya
Published on: 18 May 2023 4:55 PM IST
Pawan Kalyan Bro First Look Swag Filled
X

Pawan Kalyan Bro: బ్రో పవన్ టైం మొదలైంది..

Pawan Kalyan Bro: ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు పవన్ రెండు పడవల పై దూసుకెళ్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్, OG అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన పవన్ తాజాగా PKSDT టైటిల్ ను అనౌన్స్ చేసుకున్నాడు. ఈ సినిమాకు బ్రో టైటిల్ ను ఖరారు చేస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. మోషన్ పోస్టర్ లో పవన్ లుక్ తో పాటు తమన్ స్కోర్ దద్దరిల్లిపోయింది.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక సినిమా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. తమిళ హిట్ మూవీ వినోదయ సీతంకు ఫ్రీమేక్ గా దర్శకుడు సముద్ర ఖని నేతృత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు పవన్ గురూజీ..త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి బ్రో అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈమేరకు టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

బ్రో మోషన్ పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో ఉన్న పవన్ కల్యాణ్ ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ సినిమాలో పవన్ పాత్ర నిడివి చాలా తక్కువ ఉంటుందని తెలియడంతో ఫ్యాన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. వారి ఫోకస్ అంతా ఉస్తాద్ భగత్ సింగ్, OG పైనే ఉంది. అయితే ఎప్పుడైతే పోస్టర్ వచ్చిందో..ఫ్యాన్స్ లో ఆసక్తితో పాటు అంచనాలు పెరిగాయి. మోషన్ పోస్టర్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సింప్లీ సూపర్బ్ గా ఉంది. శివ స్తోత్రంతో బ్రో అంటూ వచ్చే ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.

వకీల్ సాబ్ మూవీ నుంచి పవన్ నటిస్తున్న ప్రతి సినిమాకీ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ సినిమాలు అంత పెద్ద హిట్టవ్వడానికి ప్రధాన కారణాల్లో థమన్ మ్యూజిక్ ఒకటి. బ్రో మూవీకి సైతం థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఉంటాడని పవన్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇకపోతే బ్రో మూవీ జూలై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Dhatripriya

Dhatripriya

Next Story