బ్యాలెట్ బాక్సే కాదు బాక్సాఫీస్ దగ్గర కూడా వార్.. యాత్ర 2కి పోటీగా పవన్ బయోపిక్.. త్వరలో ప్రకటించబోతున్న స్టార్ డైరెక్టర్..?

Pawan Kalyan Biopic on Cards in Competition to Yatra 2
x

బ్యాలెట్ బాక్సే కాదు బాక్సాఫీస్ దగ్గర కూడా వార్.. యాత్ర 2కి పోటీగా పవన్ బయోపిక్.. త్వరలో ప్రకటించబోతున్న స్టార్ డైరెక్టర్..?

Highlights

Movie News: ఏపీకి మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి కూడా.

Movie News: ఏపీకి మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి కూడా. ప్రజలకు చేరువయ్యేందుకు ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలనే ఆయుధంగా చేసుకొని అధికార వైసీపీ, ప్రభుత్వ వైఫల్యాలనే ప్రచార అస్త్రాలుగా మలుచుకొని ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్నికల సంగ్రామంలో తలపడేందుకు ఎత్తులు వేసుకుంటున్నాయి. ఈ తరుణంలో సినిమాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

గత ఎన్నికల వేళ వైఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ వచ్చింది. యాత్ర టైటిల్ తో మమ్ముటి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీని మహి వి. రాఘవ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టవ్వడమే కాదు..వైఎస్సార్సీపీకి తిరుగులేని విజయం అందించడంలో తనవంతు పాత్రను పోషించింది. ఇక 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ యాత్ర సినిమాకు సీక్వెల్ సిద్ధం చేస్తున్నాడు మహి. వి.రాఘవ. జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ ను ఎన్నికల సమయానికి విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

యాత్ర2లో జగన్ పాత్రను ప్రముఖ తమిళ హీరో జీవా పోషించబోతున్నాడు. ఇదిలాఉంటే, ఈ సినిమాకి పోటీగా పవన్ బయోపిక్ రెడీ ఔతోందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ ని పవన్ వీరాభిమానిగా చెప్పుకునే హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్నాడని, ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్న హరీష్..పవన్ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే బ్యాలెట్ బాక్సుల వద్దే కాదు బాక్సాఫీసుల దగ్గర కూడా జగన్ – పవన్ ఢీ కొడతారన్నమాట.

Show Full Article
Print Article
Next Story
More Stories