Pawan Kalyan: అన్నయ్య కోసం సంక్రాంతిని త్యాగం చేసిన స్టార్ హీరో

Pawan Kalyan: ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ తదుపరి సినిమా విడుదల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

admin1
Updated on: 20 Aug 2021 3:41 PM IST
Pawan Kalyan Bheemla Nayak Sacrifice for Chiranjeevi Acharya Movie Release on Sankranthi 2021
X

అన్నయ్య కోసం సంక్రాంతి ని త్యాగం చేసిన స్టార్ హీరో

Pawan Kalyan: థియేటర్లు మళ్ళీ ఓపెన్ అవ్వడం తో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఒకదాని తర్వాత మరొకటి విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ తదుపరి సినిమా విడుదల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా అయిన "భీమ్లా నాయక్" వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి బరిలో దిగనుంది అని వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం తను అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్ ఆ తేదీని త్యాగం చేశారట.

తాజా సమాచారం ప్రకారం సంక్రాంతి బరిలో దిగాల్సిన నాయక్ విడుదల వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంలో కొంత అసహనం వ్యక్తం చేసినప్పటికీ మెగా అభిమానులు మాత్రం మెగాస్టార్ చిరంజీవి కోసమే పవన్ కళ్యాణ్ తన సినిమాని వాయిదా వేసుకున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ను కొనియాడారు. ఇక పవన్ కళ్యాణ్ మరియు రానా హీరోలుగా నటిస్తున్న "భీమ్లా నాయక్" విడుదల తేదీ పై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. మెగాస్టార్ "ఆచార్య" జనవరి 12న విడుదలకు సిద్ధమవుతుండగా, 13న మహేష్ బాబు "సర్కారు వారి పాట" మరియు 14వ తేదీన ప్రభాస్ "రాధే శ్యామ్" సినిమాలు విడుదల కాబోతున్నాయి.

admin1

admin1

Next Story