Bheemla Nayak - Acharya: ఆచార్య అభ్యర్ధన తిరస్కరించిన భీమ్లా నాయక్

admin1
Updated on: 25 Aug 2021 6:31 PM IST
Bheemla Nayak Movie Producers Declines Acharya Movie Producers Request of Release Date
X

చిరంజీవి - పవన్ కళ్యాణ్ 

Bheemla Nayak - Acharya: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న "భీమ్లా నాయక్" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోందని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ మీకు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ఆచార్య" సినిమాని కూడా అదే రోజున సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే "భీమ్లా నాయక్" సినిమాని వాయిదా వేయమని "ఆచార్య" దర్శకనిర్మాతలు కోరారు.

అంతేకాకుండా "భీమ్లా నాయక్" రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల అయితే తమ సినిమాని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు. కానీ "భీమ్లా నాయక్" నిర్మాతలు మాత్రం దీనికి ససేమిరా ఒప్పుకోలేదు. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని కొట్టిపారేశారు. ఇక చేసేది లేక "ఆచార్య" దర్శక నిర్మాతలు సినిమా కోసం మరొక విడుదల తేదీ వెతికే పనిలో పడ్డారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న "ఆచార్య" సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story