La La Bheemla Promo: నుదుటిన తిలకంతో.., మందు సీసాతో "లాలా భీమ్లా" వచ్చేశాడు

Sandeep Reddy
Updated on: 3 Nov 2021 7:07 PM IST
Pawan Kalyan Bheemla Nayak Movie La La Bheemla Video Promo Out Today 03 11 2021
X

"లాలా భీమ్లా" వీడియో ప్రోమో (ట్విట్టర్ ఫోటో)

La La Bheemla Video Promo: "వకీల్ సాబ్" వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మలయాళ సూపర్ హిట్ సినిమా "అయ్యప్పన్ కోశియమ్" రీమేక్ "భీమ్లా నాయక్" గా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే అంతా ఇష్టమే పాటతో అభిమానులను ఆకట్టుకున్న పవర్ స్టార్ కి సంబంధించిన రెండో పాటని విడుదల చేసింది "భీమ్లా నాయక్" చిత్ర యూనిట్. తాజాగా పవన్ కళ్యాణ్ పాత్రని తెలుపుతూ "లాలా భీమ్లా" అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కి సంబంధించిన వీడియో ప్రోమో 2021 నవంబర్ 3న రాత్రి 7.02 నిమిషాలకు విడుదల చేశారు.

'ఈ దీపావళిని #TheSoundOfBheemlaతో జరుపుకుందామంటూ చిత్ర యూనిట్ ఇటీవలే పోస్ట్ చేసింది. ఇక సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ నటిస్తుండగా రానా, సంయుక్త మరొక జోడిగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో సినీ అభిమానులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ భీమ్లా నాయక్ చిత్రానికి తమన్ తన సంగీతాన్ని అందిస్తున్నాడు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story