Bheemla Nayak: "భీమ్లా నాయక్" రైట్స్ చేజిక్కించుకున్న అమెజాన్ ప్రైమ్

* భారీ మొత్తానికి అమ్ముడైన పవన్ కళ్యాణ్ సినిమా

admin1
Updated on: 9 Oct 2021 12:49 PM IST
Pawan Kalayan Bheemla Nayak Movie Digital Rights Acquired by Amazon Prime
X

"భీమ్లా నాయక్" పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

Bheemla Nayak Movie: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రానా దగ్గుబాటి తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియిమ్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం "భీమ్లా నాయక్" అనే టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

అయితే సినిమా నుంచి విడుదలైన టీజర్ కేవలం పవన్ కళ్యాణ్ పాత్రకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉంటుంది. కాబట్టి ఈసారి దర్శకనిర్మాతలు రానా పాత్ర మీద ఒక టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి డైలాగులు అందిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను భారీ వ్యయంతో సొంతం చేసుకుంది. "వకీల్ సాబ్" సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో అమెజాన్ వారు "భీమ్లా నాయక్" డిజిటల్ రైట్స్ ను భారీ మొత్తానికి కొన్నట్లు తెలుస్తోంది. ఆ ఫిగర్ ను మాత్రం దర్శకనిర్మాతలు బయటకు రానివ్వడం లేదు. ఇక ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

admin1

admin1

Next Story