AM Ratnam: 'వీరమల్లు' నిర్మాతకు కీలక పదవి.. ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌..?

Pawan Kalyan Announces Big Offer To AM Ratnam
x

AM Ratnam: 'వీరమల్లు' నిర్మాతకు కీలక పదవి.. ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌..?

Highlights

AM Ratnam: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఈ నెల జులై 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

AM Ratnam: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఈ నెల జులై 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఇది తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం గమనార్హం. ఈ చిత్రంలో పవన్ చారిత్రాత్మక యోధుడిగా పాత్రలో దర్శనం ఇవ్వనున్నారు.

ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, బాబీ డియోల్, సత్యరాజ్, అనుపమ్ ఖేర్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. క్రిష్ – జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో నాకు అంతగా తెలియదు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి అసలు కారణం ఏఎం రత్నమే," అని పవన్ పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఏఎం రత్నం సినీ పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడుతూ.."ప్రాంతీయ సినిమాలను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయనే. కేవలం నా నిర్మాత కాబట్టి కాదు... ఆయన చాలా మంది హీరోలతో పనిచేశారు. దేశవ్యాప్తంగా ఆయనకు గల పరిచయాలు ఇండస్ట్రీకి ఉపయోగపడతాయి" అని అన్నారు.

ఇంతటితో ఆగకుండా పవన్ కల్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబుకు ఏఎం రత్నం పేరును AP ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి ప్రతిపాదించినట్లు వెల్లడించారు. "నా పరిధిలో ఉన్న విషయం కాబట్టి ఆయన పేరును సిఫార్సు చేశాను. ఆయన ఆ పదవికి అర్హుడు. ఆయనకు అవకాశం ఇస్తే టాలీవుడ్‌కు మరింత దిక్సూచి లభిస్తుంది" అని పవన్ అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories