మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సిద్ధమైన మెగా హీరోలు

మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సిద్ధమైన మెగా హీరోలు

admin1
Updated on: 2 March 2022 8:00 PM IST
Pawan Kalyan and Sai Dharam Tej Acting Togeter | Tollywood News
X

మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సిద్ధమైన మెగా హీరోలు

Pawan Kalyan-Sai Dharam Tej: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మధ్యనే "వ‌కీల్ సాబ్‌" తో రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారారు. ఈమధ్యనే విడుదల అయిన "భీమ్లా నాయక్" సినిమాతో పవన్ కళ్యాణ్ మరొక బ్లాక్ బస్టర్ ను నమోదు చేసుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో "హ‌రి హ‌ర వీర మ‌ల్లు", హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో "భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌", సురేంద‌ర్ రెడ్డితో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొక సినిమాకి ఓకే అన్నారంటూ సినీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక మెగా హీరో కూడా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ మెగా హీరో మరెవరో కాదు సాయి ధరమ్ తేజ్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తన మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ తో కలిసి సినిమా చేయనున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన స‌ముద్ర ఖ‌ని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అంతే కాకుండా సముద్ర ఖని ఈ సినిమా లో కీలక పాత్రలో న‌టించనున్నారట. "రిప‌బ్లిక్" సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సాయి ధరమ్ తేజ్ గ‌త ఏడాది రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజ్ బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా ఓ థ్రిల్ల‌ర్ సినిమాలో నటిస్తున్నారు.

admin1

admin1

Next Story