ఇటు పవర్ స్టార్, అటు ధనుష్.. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ మాస్‌ సెలబ్రేషన్స్‌

Pawan Kalyan: సౌత్ కి చెందిన రెండు పెద్ద చిత్ర పరిశ్రమల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Samba Siva Rao
Published on: 9 April 2021 5:25 PM IST
Pawan Kalyan,Vakeel Saab Movie Released
X

‘కర్ణన్‌’, వకీల్ సాబ్ 

Pawan Kalyan: దక్షిణాదికి చెందిన రెండు పెద్ద సినిమా ఇండస్ట్రీల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈరోజు 'వకీల్ సాబ్' విడుదల అవడంతో థియేటర్ల వద్ద పవన్ మేనియా ఏంటో చూపించారు. గత మూడేళ్ళ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. కరోనా వైరస్ సైతం లెక్కచేయకుండా భారీ సంఖ్యలో థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో థియేటర్లు అన్ని హౌస్ ఫూల్ బోర్డులు వెలిశాయి. థియేటర్ల ముందు భారీ కటౌట్స్ వెలిశాయి. 'వకీల్ సాబ్' థియేటర్ల వద్ద సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో చేశారు.

తమిళనాట స్టార్ హీరో ధనుష్‌ ప్రధానపాత్రలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'కర్ణన్‌'. మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యింది. చాలారోజుల తర్వాత ధనుష్‌ సినిమా విడుదల కావడంతో ఆయన అభిమానులు సినిమా హాళ్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. డ్యాన్స్‌లు, ఈలలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.





Samba Siva Rao

Samba Siva Rao

Next Story