Pawan Kalyan: కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్.. ఆ 3 ముగ్గుర్ని నామినేట్ చేసిన..

Pawan Kalyan: జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా.. చేనేత దుస్తులు ధరించాలని తాను ధరించి కొన్ని ఫోటోలను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసారు కేటీఆర్‌.

Arun Chilukuri
Updated on: 7 Aug 2022 2:00 PM IST
Pawan Kalyan Accepted KTR Challenge
X

Pawan Kalyan: కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్.. ఆ 3 ముగ్గుర్ని నామినేట్ చేసిన..

Pawan Kalyan: జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా.. చేనేత దుస్తులు ధరించాలని తాను ధరించి కొన్ని ఫోటోలను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసారు కేటీఆర్‌. అంతేకాకుండా చేనేత దుస్తులు ధరించాలని పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా, మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌తో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మంత్రి కేటీఆర్‌ సవాలు విసిరారు. ఈ సందర్భంగా పవన్‌ స్పందిస్తూ కేటీఆర్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

'రామ్‌ భాయ్‌ (కేటీఆర్‌).. మీ ఛాలెంజ్‌ను స్వీకరించా' అంటూ చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌, ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి పవన్‌ 'చేనేత' సవాల్‌ విసిరారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలని పవన్‌ వారిని కోరారు. పవన్ తన ఛాలెంజ్ ను స్వీకరించడంతో థ్యాంక్స్ అన్న అంటూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story