Pavan Kalyan: పూరికి పవన్ కళ్యాణ్ ఓకె చెప్పినట్లేనా?

Pavan Kalyan: పూరీ జగన్నాథ్ చెప్పిన కథకు పీకె ఓకె చెప్పినట్లు టాలీవుడ్ టాక్.

Kranthi
Updated on: 3 Jun 2021 12:00 PM IST
Pavan Kalyan in Puri Jagannadh Direction
X

పవన్ కళ్యాణ్ & పూరి జగన్నాధ్ (ఫైల్ ఇమేజ్)

Pavan Kalyan: పవన్ కల్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా ఈసారి సీఎం పాత్రలో నటిస్తాడని టాక్.. అది కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. అదిరిపోద్ది కదూ. అవును వరుస సినిమాలతో క్రేజీ హీరో పవన్ కల్యాణ్ కేక పుట్టిస్తున్నాడు. వకీల్ సాబ్ సినిమాతో తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని.. ఇంకా పెరిగిందని ప్రూవ్ చేసుకున్న పీకె.. ఈసారి అభిమానుల చిరకాల కోరికను సినిమాలో తీర్చడానికి సీఎం పాత్రలో నటించబోతున్నాడు. పూరీ జగన్నాథ్ చెప్పిన కథకు పీకె ఓకె చెప్పినట్లు టాలీవుడ్ టాక్.

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'వకీల్ సాబ్' భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఆయన చేయనున్న రెండు భారీ సినిమాలు సెట్స్ పైనే ఉన్నాయి. ఒకటి క్రిష్ దర్శకత్వంలో .. మరొకటి సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్నాయి. ఆ తరువాత సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పూరి జగన్నాథ్ పేరు కూడా తెరపైకి వచ్చింది.

పూరి జగన్నాథ్ .. పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టు సెట్ కానుందట. పవన్ కల్యాణ్ క్రేజ్ కి తగినట్టుగా తన స్టైల్ లోనే పూరి ఒక కథను తయారు చేశాడని అంటున్నారు. ఆ కథతో పవన్ తో సినిమా చేయడానికి ఒక పెద్ద బ్యానర్ రంగంలోకి దిగిందట. అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మూవీలో పవన్ పాత్ర సీఎం పాత్రలో అదరగొట్టనున్నాడని సమాచారం. పూరీ గతంలో మహేష్ బాబుతో చేయాలనుకున్న ఈ సినిమాను పవన్‌తో చేయనున్నాడట. అంతేకాదు ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని పూరీ తన మార్క్ స్టైల్ లో ఈ కథను అల్లుకుని పవన్ కు నచ్చే విధంగా అనేక మార్పులు చేసాడట. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

Kranthi

Kranthi

Next Story