Parvathy Thiruvothu: నేను పీరియడ్స్‌లో ఉన్నాను.. వెళ్లనివ్వండి.. డైరెక్షన్ టీమ్ పై అరిచేసిన హీరోయిన్

Parvathy Thiruvothu: నేను పీరియడ్స్‌లో ఉన్నాను.. వెళ్లనివ్వండి.. డైరెక్షన్ టీమ్ పై అరిచేసిన హీరోయిన్
x
Highlights

మలయాళ హీరోయిన్ పార్వతి తిరువోత్ తన కెరీర్‌లో ఎదురైన బాధాకరమైన అనుభవాన్ని ఇప్పుడు బయటపెట్టారు. 'మర్యన్' సినిమా షూటింగ్ సమయంలో పీరియడ్స్‌లో ఉన్నప్పటికీ...

మలయాళ హీరోయిన్ పార్వతి తిరువోత్ తన కెరీర్‌లో ఎదురైన బాధాకరమైన అనుభవాన్ని ఇప్పుడు బయటపెట్టారు. 'మర్యన్' సినిమా షూటింగ్ సమయంలో పీరియడ్స్‌లో ఉన్నప్పటికీ బీచ్ సీన్‌లో నీళ్లలో ముంచి తడిపారని, అసౌకర్యం చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని వెల్లడించారు. ఆ సమయంలో ఒంటరితనం ఎంతో బాధించిందని చెప్పారు.

2013లో ధనుష్ హీరోగా విడుదలైన తమిళ చిత్రం 'మర్యన్'లో నటించిన పార్వతి తిరువోత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో జరిగిన ఘటనను గుర్తుచేసుకున్నారు. బీచ్‌లో జరిగిన సన్నివేశంలో తనను పూర్తిగా నీళ్లలో ముంచి తడిపారట. ఆ రోజు ఆమె పీరియడ్స్‌లో ఉన్నారట. అదనపు డ్రెస్ తీసుకెళ్లలేదట. నీళ్లతో తడిసిన బట్టలతోనే షూటింగ్ కొనసాగించాల్సి వచ్చిందట.

చాలా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉందని హోటల్‌కు వెళ్లి బట్టలు మార్చుకుని రావాలని చెప్పినా దర్శక, నిర్మాణ బృందం అంగీకరించలేదట. చివరకు గట్టిగా అరిచి చెప్పినా ఎవరూ పెద్దగా స్పందించలేదట. ఆ రోజు సెట్‌లో ఆమెతో పాటు ముగ్గురు మహిళలు మాత్రమే ఉన్నారట. ఒంటరితనం, ఓపిక కోల్పోయే స్థాయికి చేరుకున్నానని పార్వతి వివరించారు. ఈ అనుభవం ఆమెను ఎంతో బాధపెట్టిందని తెలిపారు. పార్వతి మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం మలయాళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories