"మేడం మేడం" అని హీరోయిన్ వెంట తిరగనున్న నాగ చైతన్య

* "మేడం మేడం" అని హీరోయిన్ వెంట తిరగనున్న నాగ చైతన్య

Rama Rao
Updated on: 27 May 2022 4:30 PM IST
Parshuram Re-uses the Madam Madam Strategy | Tollywood News
X

"మేడం మేడం" అని హీరోయిన్ వెంట తిరగనున్న నాగ చైతన్య 

Naga Chaitanya: అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన "అల వైకుంఠ పురం లో" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలు చాలా విభిన్నంగా మరియు ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా బన్నీ పాత్ర పూజా హెగ్డే ను "మేడం మేడం" అంటూ పిలవడం అభిమానులకు బాగా నచ్చేసింది.

నిజానికి ఇదే థీమ్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన "గీతగోవిందం" సినిమాలో కూడా వాడారు డైరెక్టర్ పరుశురామ్. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే తాజా సమాచారం ప్రకారం మళ్లీ ఇదే ఫార్ములాని వాడాలని డైరెక్టర్ పరుశురాం అనుకుంటున్నారట. యువ హీరో నాగచైతన్య కోసం పరశురామ్ నాగేశ్వరరావు అనే ఒక కథని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

ఇది ఒక మిడిల్ క్లాస్ క‌థ‌. చైతూని మిడిల్ క్లాస్ అబ్బాయిగా చూపించ‌బోతున్నాడు పరశురామ్. హీరోయిన్ ని రిచ్ అమ్మాయిగా, ఓ కంపెనీ సీఈఓగా ఉంటుందట. అదే కంపెనీలో హీరో ఒక ఉద్యోగిగా ఉంటాడట. దాంతో ఇక్క‌డ కూడా "మేడ‌మ్.. మేడ‌మ్‌" అంటూ హీరోయిన్ వెంట హీరో పడతారంట. మరి ఈ సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి.

Rama Rao

Rama Rao

Next Story