నాగచైతన్య వల్ల పరశురామ్ కి దెబ్బ మీద దెబ్బ

*నాగచైతన్య వల్ల పరశురామ్ కి దెబ్బ మీద దెబ్బ

Rama Rao
Updated on: 24 July 2022 6:30 PM IST
Parasuram Waiting For Naga Chaitanya Movie | Tollywood
X

నాగచైతన్య వల్ల పరశురామ్ కి దెబ్బ మీద దెబ్బ

Naga Chaitanya: "గీత గోవిందం" సినిమాతో మంచి హిట్ అందుకున్న పరశురామ్ ఈ మధ్యనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "సర్కారు వారి పాట" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మధ్యనే థియేటర్లలో విడుదలైనా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం యావరేజ్ గా నిలిచింది. సినిమా కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు.

ఈ సినిమా రిజల్ట్ తో డైరెక్టర్ పరశురామ్ కూడా షాక్ అయ్యారు. ఇంకా "సర్కారు వారి పాట" సినిమా ఇచ్చిన షాక్ నుంచి తెరుకోని పరశురామ్ కి తాజాగా నాగచైతన్య వల్ల మరొక షాక్ ఏర్పడింది. నిజానికి మహేష్ "గీత గోవిందం" సినిమా తర్వాత పరశురామ్ నాగచైతన్య హీరోగా ఒక సినిమా చేయాల్సింది. కానీ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం రావడంతో పరశురామ్ నాగచైతన్యను హోల్ లో పెట్టి మహేష్ బాబుతో "సర్కారు వారి పాట" సినిమాని పూర్తి చేశారు.

తాజాగా ఇప్పుడు నాగచైతన్యతో సినిమాని మళ్లీ పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చేయటానికి సిద్ధమైన పరుశురామ్ కు నాగచైతన్య పెద్ద షాక్ ఇచ్చాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తాను చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాతే తనతో సినిమాని మొదలు పెడతానని నాగచైతన్య పరశురామ్ కి చెప్పారు. మరోవైపు "థాంక్యూ" సినిమాతో ఫ్లాప్ అందుకున్న నాగచైతన్య పరశురామ్ తో సినిమాని మొదలు పెడతారా లేక ఆ సినిమాని హోల్డ్ లోనే ఉంచేస్తారా అంటూ అనుమానాలు కూడా మొదలయ్యాయి.

Rama Rao

Rama Rao

Next Story