మహేష్ బాబుతో సినిమా లైఫ్ టైం అచీవ్మెంట్ అంటున్న డైరెక్టర్

మహేష్ బాబుతో సినిమా లైఫ్ టైం అచీవ్మెంట్ అంటున్న డైరెక్టర్

Rama Rao
Updated on: 5 May 2022 2:30 PM IST
Parasuram Talks About working With Mahesh Babu | Telugu News
X

మహేష్ బాబుతో సినిమా లైఫ్ టైం అచీవ్మెంట్ అంటున్న డైరెక్టర్

Parasuram: నిఖిల్ హీరోగా నటించిన "యువత" సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు పరశురామ్. ఆ తరువాత "ఆంజనేయులు" సినిమాతో పర్వాలేదు అనిపించిన పరశురామ్ "సోలో" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఇక 2018లో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన "గీత గోవిందం" సినిమా తో కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు పరశురామ్.

సినిమా సక్సెస్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు తో పనిచేసే అవకాశాన్ని అందుకున్నారు పరశురామ్. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు తాను ఇండస్ట్రీ లోకి రావడానికి కారణం మహేష్ బాబు అని చెప్పుకొచ్చారు పరశురామ్. "మహేష్ బాబు ఒక్కడు సినిమా చూశాక సినీ ఇండస్ట్రీ లోకి రావాలని నిర్ణయించుకున్నాను.

పూరి జగన్నాథ్ గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ నా కెరీర్ ను ప్రారంభించాను. మహేష్ బాబు గారితో సర్కారు వారి పాట సినిమా చేయడం నా లైఫ్ టైం అచీవ్మెంట్" అని అంటున్నారు పరశురామ్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య మే 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు చార్ట్ బస్టర్ లుగా నిలవగా ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

Rama Rao

Rama Rao

Next Story