మహేష్ బాబు పరశురాం సినిమా కథ ఇదేనా

మహేష్ బాబు పరశురాం సినిమా కథ ఇదేనా
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా 'మహర్షి' సినిమా ఎట్టకేలకు విడుదలైన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రేక్షకుల...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా 'మహర్షి' సినిమా ఎట్టకేలకు విడుదలైన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే మిక్స్డ్ రెస్పాన్స్ ని అందుకుంటోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి ఏంటి అన్నది మరొక రెండు వారాల్లో ఓ క్లారిటీ రానుంది. మరొక వైపు మహేష్ బాబు కుటుంబంతో సహా విదేశాలలో హాలిడే ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాగానే తన తదుపరి సినిమా ను మొదలుపెట్టానున్నాడు సూపర్ స్టార్.

ఇప్పటికే మహేష్ బాబు 26వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. మరొకవైపు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ 27వ చిత్రాన్ని చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం దేశంలో లో నడుస్తున్న ఒక తీవ్రమైన సమస్య గురించి ఈ చిత్రంలో పరాశురాం చూపించనున్నాడట. అంతేకాక ఒక ఈ సినిమా లో ఒక చక్కని సందేశం కూడా ఉండబోతోందని, శంకర్ రేంజ్ లో ఇష్యూ గురించి చూపిస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ ను సైతం జోడి చేస్తున్నారని తెలుస్తోంది. గీత ఆర్ట్స్ నిర్మించనున్న మహేష్ 27 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories