రెండవ సినిమాకి రెడి అయిన 'పంతం' దర్శకుడు

Ruthvik
Published on: 2 March 2019 3:19 PM IST
రెండవ సినిమాకి రెడి అయిన పంతం దర్శకుడు
X

'బలుపు', 'పవర్', 'జై లవకుశ' సినిమాలకు రైటర్ గా పని చేసిన చక్రవర్తి పంతం సినిమాతో దర్శకుడిగా మారారు. గోపిచంద్, మెహరీన్ పిర్జాదా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సోషల్ డ్రామాగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కలెక్షన్ల పరంగా పక్కనపెడితే సినిమా మంచి మార్కులే వేయించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ వెంకటేష్ నాగచైతన్య నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా 'వెంకీ మామా' కు రైటర్ గా పని చేస్తున్నారు చక్రవర్తి. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మళ్లీ ఆయన దర్శకత్వం వైపు దృష్టి మరల్చారు.

దర్శకుడిగా తన రెండవ చిత్రాన్ని త్వరలో మొదలుపెట్టనున్నారు చక్రవర్తి. ఈసారి ఒక యువ హీరో తో సినిమాను తీయాలని ప్లాన్ చేస్తున్నారట. అన్ని అనుకున్నట్లు సాగితే ఈ సినిమా షూటింగ్ మరొక రెండు నెలల్లో పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మొదటి సినిమాతో పర్వాలేదనిపించిన కె చక్రవర్తి రెండవ సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తారు అనేది ఇంకా వేచి చూడాల్సిందే.

Ruthvik

Ruthvik

Next Story