KGF Chapter 2: ఇబ్బందుల్లో పడ్డ "కే జి ఎఫ్ చాప్టర్ 2"

KGF Chapter 2: "కే జి ఎఫ్ టు" తో పోటీపడుతున్న ప్యాన్ ఇండియన్ సినిమాలు

admin1
Updated on: 26 Jan 2022 2:15 PM IST
Pan Indian Movies Competing With KGF Chapter 2 Movie | Telugu Movie News
X

 ఇబ్బందుల్లో పడ్డ "కే జి ఎఫ్ చాప్టర్ 2"

KGF Chapter 2: నిజానికి చాలానే ప్యాన్ ఇండియన్ సినిమాలు ఈ ఏడాది మొదట్లోనే విడుదలకు సిద్ధమయ్యాయి. కానీ కరోనా కారణంగా అన్ని విడుదలలు వాయిదా పడ్డాయి. జనవరి 7న విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ నుంచి ఫిబ్రవరి లో విడుదల కావాల్సిన చాలావరకు ప్యాన్ ఇండియన్ సినిమాలు ప్రేక్షకులను, అభిమానులను నిరాశపరుస్తూ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో "కే జి ఎఫ్ 2" సినిమా కి చాలానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా "కే జి ఎఫ్" కి సీక్వెల్ గా ఇప్పుడు 'కే జి ఎఫ్: చాప్టర్ 2' అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ 14న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

అయితే మార్చి దాకా విడుదల కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడి ఇప్పుడు వేసవి విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నాయి. లాల్ సింగ్ చెడ్డ, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు కూడా అదే రోజు లేదా అదే వారంలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమా "బీస్ట్" కూడా అప్పుడే విడుదలకు సిద్దమవుతోంది. దీంతో "కే జి ఎఫ్ 2" సినిమా కి థియేటర్ ల తో పాటు కలెక్షన్లు కూడా తగ్గిపోతాయి ఏమోనని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు తో పాటు అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. మరి ఈ సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేస్తారా లేక వాయిదా వేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story