Adipurush: ఇక ముంబైలోనే పాన్ ఇండియా స్టార్..?

Adipurush: వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీ షెడ్యూల్‌ తో దూసుకుపోతున్నాడు పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌.

Venkata Chari
Published on: 3 March 2021 3:05 PM IST
Pan India Star Prabhas to buy Apartment in Mumbai
X

Prabhas (ఫోటో హన్స్ ఇండియా)

Adipurush: వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీ షెడ్యూల్‌ తో దూసుకుపోతున్నాడు పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌. ప్రస్తుతం 'సలార్‌'తో బిజీగా ఉన్న ఆయన త్వరలో మరో సినిమా 'ఆదిపురుష్‌' షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియా, టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

'ఆదిపురుష్‌' చిత్రీకరణ ప్రారంభమైన నాటి నుంచి కంప్లీట్ అయ్యే వరకూ ప్రభాస్‌ ఎక్కువ శాతం ముంబయిలోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని రోజులు హోటల్‌లో కాకుండా ఫ్లాట్‌లో ఉండాలని ఆయన భావిస్తున్నారట‌. ముంబయిలోని ఖరీదైన ఏరియాలో ఓ విలాసవంతమైన ఫ్లాట్‌ కొనుగోలు చేసేందుకు ప్రభాస్ చూస్తున్నట్లు సమాచారం. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‌, రష్మిక సైతం ముంబయికి షిప్ట్ అయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి.

కాగా, 'ఆదిపురుష్‌' సినిమా.. రామాయణాన్ని ఆధారంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఓంరౌత్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు. సీతగా కృతిసనన్‌, రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story