Pan-India Movies: భారీ మొత్తానికి అమ్ముడైన ప్యాన్ ఇండియా సినిమాలు

Pan-India Movies: దాదాపు అందరు స్టార్ హీరోలు ఇప్పుడు ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు...

admin1
Updated on: 16 March 2022 4:30 PM IST
Pan-India Movies KGF Chapter 2 and Salaar Movie Sold on Huge Amount to Distributor Company | Live News
X

Pan-India Movies: భారీ మొత్తానికి అమ్ముడైన ప్యాన్ ఇండియా సినిమాలు

Pan-India Movies: బాహుబలి సినిమా తరువాత చాలామంది స్టార్ హీరోలు మరియు డైరెక్టర్లు ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయడానికి అభ్యంతరం చెప్పడం లేదు. దాదాపు అందరు స్టార్ హీరోలు ఇప్పుడు ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో సౌత్ లోనే రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్యన విడుదలకు సిద్ధమవుతున్నాయి.

అందులో మొదటిది యశ్ హీరోగా బ్లాక్ బస్టర్ గా మారిన కన్నడ సినిమా "కే జి ఎఫ్ చాప్టర్ 1" కి సీక్వెల్ అయిన "కే జి ఎఫ్ చాప్టర్ 2" కాగా రెండవది ప్రభాస్ హీరోగా చేస్తున్న "సలార్". ఆసక్తికరంగా ఈ రెండు సినిమాలకీ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు సినిమాలు యాక్షన్ ఎంటర్టైనర్ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు ఒకేసారి భారీ రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ చేశాయి. ఓవర్సీస్ లో ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సంస్థ రికార్డు స్థాయిలో మొత్తాన్ని చిత్ర నిర్మాతలకు చెల్లించి ఈ రెండు సినిమాల రైట్స్ను కొనుగోలు చేసిందట. ఆ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు అన్ని భాషలకు కలిపి పెద్ద మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story