Bigg Boss Telugu 7 Winner: బిగ్‌బాస్‌ 7 తెలుగు విజేతగా రైతుబిడ్డ.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth: గత కొంతకాలంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకపోతోన్న బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ రేపటితో ఎండ్ కార్డ్ పడనుంది.

Arun Chilukuri
Published on: 16 Dec 2023 9:20 PM IST
Pallavi Prashanth Winner for the Bigg Boss 7 Telugu Grand Finale Check Latest Updates and Prize Money Details
X

Bigg Boss Telugu 7 Winner: బిగ్‌బాస్‌ 7 తెలుగు విజేతగా రైతుబిడ్డ.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth: గత కొంతకాలంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకపోతోన్న బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ రేపటితో ఎండ్ కార్డ్ పడనుంది. అయితే, నేడు ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ జరుగతోంది. ఈ క్రమంలో అక్కడ జరిగే పరిస్థితులను సోషల్ మీడియాలో కొంతమంది పంచుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రాండ్ ఫినాలేలోకి ఆరుగురు చేరుకున్నారు. వారిలో అమర్, శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అర్జున్ ఉన్నారు.

అయితే, వీరిలో ఇప్పటికే ముగ్గురు యావర్ (4వ స్థానం), ప్రియాంక (5వ స్థానం), అర్జున్ (6వ స్థానం) ఎలిమినేట్ అయ్యారు. ప్రిన్స్ యావర్ మాత్రం రూ.15 లక్షల క్యాష్ ప్రైజ్‌తో బయటకు వచ్చాడు.

ఇక ఈ క్రమంలో శివాజీ విన్నర్ అని అంతా భావించినా.. చివరిలో బిగ్ ట్విస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురిలో అమర్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందంట. అనంతరం శివాజీ, ప్రశాంత్ విజేత లిస్టులో నిలిచారంట.

ఇక ఫైనల్ డ్రామాలో చోటు చేసుకున్న పరిణామాలతో శివాజీ రెండో స్థానంలో నిలిచాడంట. దీంతో రైతుబిడ్డగా పేరుగాంచిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 విజేతగా నిలిచాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విజేతను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రకటించాడంట. అయితే, ఫైనల్ ఎపిసోడ్ రేపు అంటే ఆదివారం ప్రసారం అయిన తర్వాతే అసలు విషయం తెలుస్తుంది.

ప్రైజ్ మనీ..

ఈ క్రమంలో విజేతగా(సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల మేరకు) నిలిచిన పల్లవీ ప్రశాంత్ భారీగానే ప్రైజ్ మనీ అందుకున్నాడంట. విజేతగా నిలిచినందుకు రూ. 15 లక్షల ప్రైజ్ మనీతోపాటు బ్రెజ్జా కార్, జోయాలుక్కాస్ నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అందుకున్నాడంట.

ఇక రెండో స్థానంలో నిలిచిన శివాజీకి కూడా భారీగా ముట్టాయంట. సీనియర్ నటుడిగా బిగ్ బాస్ 7లోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ.. ఇన్ని రోజులు ఉన్నందుకుగానూ మొత్తం రూ. 60 లక్షలు అందుకున్నాడంట.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆధారంగా చేసుకుని అందించాం. అయితే, బిగ్ బాస్ 7 తెలుగు అసలైన విన్నర్ ఎవరనేది రేపు (ఆదివారం 17వ తారీఖు)న తెలుస్తుందని గమనించగలరు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story