మెగా స్టార్ కు సారీ చెప్పిన ఆహా ఓటీటీ

మెగా స్టార్ కు సారీ చెప్పిన ఆహా ఓటీటీ
x
Highlights

మెగాస్టార్‌ అభిమానులకు ఆహా ఓటీటీ బహిరంగ క్షమాపణ చెప్పింది. ఈ మధ్య ఆహా ఓటీటీలో అల్లు అర్జున్‌కు సంబంధిచిన ప్రోమో ఒకటి రిలీజ్‌ అయ్యింది. ప్రోమో...

మెగాస్టార్‌ అభిమానులకు ఆహా ఓటీటీ బహిరంగ క్షమాపణ చెప్పింది. ఈ మధ్య ఆహా ఓటీటీలో అల్లు అర్జున్‌కు సంబంధిచిన ప్రోమో ఒకటి రిలీజ్‌ అయ్యింది. ప్రోమో అంతబాగానే ఉందిగాని పోస్ట్ చేసే ముందు మెగాస్టార్ అల్లు అర్జున్‌ అంటూ తగిలించారు. తెలుగు ఓటీటీ 'ఆహా'లో సామ్‌ జామ్‌ ప్రోగ్రామ్‌ ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్‌ సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు.

ఈ మధ్యే మెగాస్టార్‌ చిరంజీవి సామ్‌తో కలిసి సందడి చేయగా తాజాగా అల్లు అర్జున్‌ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసిన ఆహా పూర్తి ఎపిసోడ్‌ డిసెంబర్‌ 21న వీక్షించవచ్చని తెలిపింది. అయితే ప్రోమోలో అల్లు అర్జున్‌కు ముందు "మెగాస్టార్‌" అని రాసుకొచ్చారు. ఇది చూసి చిర్రెత్తిపోయిన చిరు ఫ్యాన్స్‌ 'ఆహా'పై తీవ్రంగా మండిపడుతున్నారు. మా చిరంజీవి బిరుదును అందుకునే అర్హత ఏ హీరోకు లేదని ఫైర్‌ అవుతున్నారు. దీంతో మెగాస్టార్‌ ఫ్యాన్స్‌కు సారీ చెబుతూ ఆహా ఓటీటీ అధికారికంగా ట్వీట్‌ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories