OTT: ఓటీటీ లవర్స్‌కి పండగే.. ఈ వారం ఇంట్రెస్టింగ్‌ మూవీస్‌

Telugu OTT releases this week: ఈ వారం కూడా ఓటీటీ వేదికగా కొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Nov 2024 1:13 PM IST
Telugu OTT releases this week
X

Telugu OTT releases this week

Telugu OTT releases this week: ఒకప్పుడు వారాంతం వస్తుందంటే కేవలం థియేటర్లలో విడుదలయ్యే సినిమాల గురించే చర్చ నడిచేది. కానీ ప్రస్తుతం ఓటీటీల రాకతో ప్రతీ వీకెండ్ కొంగొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ వారం కూడా ఓటీటీ వేదికగా కొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఈ వారం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'క' ఒకటి. కిరణ్‌ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా తాజాగా ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఈటీవీ విన్‌ ఓటీటీ వేదికగా ఈ సినిమా ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. డాల్బీ విజన్‌: అట్మాస్‌లో సినిమాని ఆస్వాదించొచ్చని ఈటీవీ తెలిపింది.



* ఇక ఈ వారం స్ట్రీమింగ్‌కు సిద్ధమైన మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ వికటకవి వెబ్ సిరీస్‌. జీ5 వేదికగా ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన తొలి డికెక్టివ్‌గా ప్రాజెక్ట్‌గా చెబుతోన్న ఈ సిరీస్‌ నవంబర్‌ 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

* థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న లక్కీ భాస్కర్‌ కూడా ఈ వారం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నవంబర్‌ 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఇతర ప్రాజెక్టులు ఇవే..

* అమెజాన్‌ ప్రైమ్‌లో బ్లడీ బెగ్గర్‌ (తమిళ్‌) నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

* నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సికిందర్‌ క ముకద్దర్‌ (హిందీ) నవంబరు 29 నుంచి, ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ (టాక్‌ షో) నవంబరు 30 నుంచి ది ట్రంక్‌ (కొరియన్‌) నవంబరు 29, అవర్‌ లిటిల్‌ సీక్రెట్‌ నవంబరు 27, ఫైండ్‌ మి ఇన్‌ పారిస్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 28, ది స్నో సిస్టర్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 29, ది మ్యాడ్‌నెస్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 28 స్ట్రీమింగ్ కానున్నాయి.

* అదే విధంగా డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా పారాచూట్‌ నవంబరు (వెబ్‌సిరీస్‌) నవంబరు 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది.

* సన్‌ నెక్ట్స్‌లో కృష్ణం ప్రణయ సఖి (కన్నడ) నవంబరు 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story