OTT Friday Releases: ఈ వారం ఓటీటీలో పండగే.. రిపబ్లిక్ డే వీకెండ్ స్పెషల్: చిరు, సుదీప్ నుంచి శోభిత వరకు.. క్రేజీ లైనప్ ఇవే!

OTT Friday Releases: ఈ వారం ఓటీటీలో పండగే.. రిపబ్లిక్ డే వీకెండ్ స్పెషల్: చిరు, సుదీప్ నుంచి శోభిత వరకు.. క్రేజీ లైనప్ ఇవే!
x
Highlights

రిపబ్లిక్ డే లాంగ్ వీకెండ్ సందర్భంగా ఈ శుక్రవారం (జనవరి 23) ఓటీటీలోకి ధనుష్ 'తేరే ఇష్క్ మే', శోభిత 'చీకటిలో', సుదీప్ 'మార్క్' వంటి ఆసక్తికరమైన సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి.

మూవీ లవర్స్‌కు ఈ వారం డబుల్ ధమాకా! ఒకవైపు శుక్రవారం కొత్త సినిమాలు రాబోతుండగా, మరోవైపు శని, ఆదివారాలతో పాటు సోమవారం (జనవరి 26) రిపబ్లిక్ డే సెలవు కావడంతో లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఓటీటీ సంస్థలు సూపర్ కంటెంట్‌తో రెడీ అయ్యాయి. ఈ శుక్రవారం (జనవరి 23) నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ మరియు జీ5 లోకి వస్తున్న టాప్ మూవీస్ మరియు వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇక్కడ చూడండి.

1. చీకటిలో (Cheekatilo) - అమెజాన్ ప్రైమ్ వీడియో

శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన పక్కా తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఆమె ఒక ట్రూ-క్రైమ్ పాడ్‌కాస్టర్‌గా కనిపిస్తుంది. ఒక హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ నగరం వెనుక ఉన్న చీకటి రహస్యాలను ఆమె ఎలా ఛేదించిందనేది చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది.

2. తేరే ఇష్క్ మే (Tere Ishk Mein) - నెట్‌ఫ్లిక్స్

ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన ఈ హిందీ రొమాంటిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన 'రాంజనా'కు ఇది ఒక రకమైన సీక్వెల్ వంటిది. ఒక మొండి పట్టుదల కలిగిన ఫైటర్ పైలట్ తన గతాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథ.

3. 45 - జీ5 (ZEE5)

కన్నడ పవర్ హౌస్ స్టార్స్ శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి కలిసి నటించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా. గరుడ పురాణంలోని తాత్విక అంశాలను యాక్షన్‌కు జోడించి తీసిన ఈ సినిమా కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

4. మార్క్ (Mark) - జియోహాట్‌స్టార్

కిచ్చా సుదీప్ మరో పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తున్నారు. డిస్మిస్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ నేర సామ్రాజ్యాన్ని తుదముట్టించడానికి చేసే పోరాటమే ఈ 'మార్క్'. సుదీప్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకు హైలైట్.

5. స్పేస్ జెన్: చంద్రయాన్ - జియోహాట్‌స్టార్

ఇస్రో (ISRO) ఘనకీర్తిని చాటిచెప్పే వెబ్ సిరీస్ ఇది. చంద్రయాన్-2 వైఫల్యం నుంచి చంద్రయాన్-3 అద్భుత విజయం వరకు శాస్త్రవేత్తల పోరాటాన్ని, వారి కష్టాన్ని ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో శ్రియ శరణ్ కీలక పాత్ర పోషించారు.

6. సిరాయ్ (Sirai) - జీ5 (ZEE5)

విక్రమ్ ప్రభు నటించిన తమిళ క్రైమ్ కోర్ట్‌రూమ్ డ్రామా. వ్యవస్థలోని లోపాలను, ఒక ఖైదీ తరలింపు సమయంలో జరిగే అనూహ్య పరిణామాలను ఈ సినిమాలో ఆసక్తికరంగా మలిచారు.

7. మస్తీ 4 (Mastiii 4) - జీ5 (ZEE5)

రితేష్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్, ఆఫ్తాబ్ శివదాసానిల కామెడీ ఫ్రాంచైజీలోని నాలుగో భాగం ఇది. పూర్తిస్థాయి అడల్ట్ కామెడీతో నిండిన ఈ సినిమా 'రివర్స్ మస్తీ' థీమ్‌తో నవ్వులు పూయించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories