logo

జోరుమీద ఉన్న ఆది సాయికుమార్

జోరుమీద ఉన్న ఆది సాయికుమార్
Highlights

సాయికుమార్ తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆది సాయి కుమార్ కెరీర్ మొదట్లో 'ప్రేమకావాలి' వంటి హిట్...

సాయికుమార్ తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆది సాయి కుమార్ కెరీర్ మొదట్లో 'ప్రేమకావాలి' వంటి హిట్ చిత్రాలలో నటించినప్పటికీ తరువాత వరుసగా బోలెడు డిజాస్టర్లను చవిచూశాడు. 'నెక్స్ట్ నువ్వే' సినిమా తరువాత కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా ఆది 'ఆపరేషన్ గోల్డెఫిష్' సినిమా తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా లో ఆది ఎన్ఎస్జీ కమాండో గా కనిపించనున్నాడు ఆది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమా తరువాత డైమండ్ రత్నం దర్శకత్వంలో 'బుర్రకథ' అనే ఒక సినిమాలో నటించనున్నాడు ఆది.

ఈ రెండు సినిమాలు ఇంకా విడుదల అవ్వలేదు కానీ ఇప్పటికే అది తన తదుపరి చిత్రాలను కూడా లైన్లో పెట్టేస్తున్నాడు ఆది. తాజా సమాచారం ప్రకారం ఆది సాయి కుమార్ మరొక సినిమాను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. కార్తీక్ విజ్ఞేష్ అనే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ సినిమాలో వేదిక హీరోయిన్ గా నటించనుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం అధికారిక ప్రకటన త్వరలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.


లైవ్ టీవి


Share it
Top