Sandeep Reddy Vanga: ఆ ఘనత "అర్జున్ రెడ్డి" డైరెక్టర్ కే దక్కింది..

Only Sandeep Reddy Vanga Did It, But How?
x

Sandeep Reddy Vanga: ఆ ఘనత "అర్జున్ రెడ్డి" డైరెక్టర్ కే దక్కింది..

Highlights

Sandeep Reddy Vanga: ఈ మధ్యకాలంలో తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలు బాలీవుడ్ లో కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

Sandeep Reddy Vanga: ఈ మధ్యకాలంలో తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలు బాలీవుడ్ లో కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ అవి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడటం లేదు. "జెర్సీ", "హిట్" వంటివి తెలుగులో హిట్ అయ్యాయి కానీ హిందీలో మాత్రం పెద్దగా ఆడలేదు. "ఎంసీఏ" రీమేక్ "నికమ్మా" కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ మధ్యనే అక్షయ్ కుమార్ కూడా తెలుగులో సూపర్ హిట్ అయిన "రాక్షసుడు" సినిమాని హిందీలో "కట్పుట్లి" అని టైటిల్ తో రీమేక్ చేశారు.

థియేటర్లలో కాకుండా ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. అయితే మరోవైపు హిందీలో రీమేక్ అయిన సినిమాలలో ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ ఆయన సినిమా "అర్జున్ రెడ్డి" రీమేక్ గా విడుదలైన "కబీర్ సింగ్". తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహించిన సందీప్ వంగా "కబీర్ సింగ్" కి కూడా దర్శకత్వం వహించారు.

ఆ సినిమాతో బాలీవుడ్ లో కూడా పాపులర్ అయిపోయిన సందీప్ ఇప్పుడు రణబీర్ కపూర్ తో "యానిమల్" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా కూడా ఒక సినిమా చేయబోతున్నారు. చాలావరకు తెలుగు మూవీ రీమేక్ లు హిందీలో ఫ్లాప్ అవుతున్నప్పటికీ సందీప్ వంగా మాత్రం రీమేక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఘనత దక్కించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories