Radhe Shyam: "రాధే శ్యామ్" సినిమాలో లో మిగిలిపోయిన సాంగ్ షూటింగ్

Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది.

admin1
Updated on: 21 Aug 2021 1:45 PM IST
Only One Song is Left to Complete Prabhas Radhe Shyam Movie Shooting
X

 Radhe Shyam Movie

Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. అయితే ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫాంటసీ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత నెలలోనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న రాధాకృష్ణ ట్విట్టర్ ద్వారా ఈ చిత్ర షూటింగ్ పూర్తయిందని తెలియజేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం కొత్త షూటింగ్ సెట్స్ ను ఏర్పాటు చేసే ప్రయత్నంలో పడ్డారు. ఇక అసలు విషయానికి వస్తే చిత్ర షూటింగ్ లో ఒక సాంగ్ చిత్రీకరణ మాత్రం ఇంకా పూర్తి కావాల్సి ఉంది.

అయితే ఈ పాట షూటింగ్ కోసం చిత్రబృందం యూరోప్ వెళ్ళడానికి ప్రయత్నించింది కానీ హీరోయిన్ పూజా హెగ్డే మరియు సినిమాలో ముఖ్యమైన కీలకమైన వ్యక్తి కి మధ్య జరిగిన గొడవ కారణంగా ఆగిపోయింది. సాంగ్ చిత్రీకరణ కోసం మాత్రమే కాబట్టి అసలు యూరప్ వెళ్ళొద్దని హీరో ప్రభాస్ చెప్పారు. దీనికి దర్శకనిర్మాతలు కూడా ఒప్పుకున్నారు.

కానీ ఇప్పుడు సినిమాని నిర్మిస్తున్న టి సిరీస్ వారు మాత్రం ఆ పాట కచ్చితంగా సినిమాలో ఉండాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో చేసేది లేక మళ్లీ ఆ పాట షూటింగ్ మొదలుపెట్టారు నిర్మాతలు. అయితే పాట షూటింగ్ యూరోప్లో కాకపోతే హైదరాబాద్లో చేయాలని నిర్ణయించుకున్న దర్శకనిర్మాతలు ఈ పాట చిత్రీకరణ కోసం కొన్ని షూటింగ్ సెట్స్ తయారు చేస్తున్నారు.

భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధం అవుతోంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమాలోని మొట్ట మొదటి పాటని త్వరలోనే యూట్యూబ్లో విడుదల చేద్దామని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

admin1

admin1

Next Story