Tollywood Drugs case: డ్రగ్స్‌ కేసులో కొనసాగుతున్న రానా ఈడీ విచారణ

దాదాపు 2 గంటలుగా రానాను విచారిస్తున్న ఈడీ

Sandeep Eggoju
Published on: 8 Sept 2021 12:44 PM IST
Ongoing ED Investigation in Tollywood Drugs Case on Rana
X

రానాపై కొనసాగుతున్న డ్రగ్స్ కేసు (ఫైల్ ఇమేజ్)

Tollywood Drugs case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో రానా దగ్గుబాటి ఈడీ విచారణ కొనసాగుతోంది. దాదాపు 2 గంటలుగా రానాను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. బ్లాక్‌ బ్యాగ్‌లో డాక్యుమెంట్లు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లతో రానా ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. రానాతో పాటు.. విచారణకు పీఏ, చార్టెడ్‌ అకౌంటెంట్ కూడా హాజరయ్యారు. విదేశీ టూర్లు, మనీ ట్రాన్జాక్షన్లపై కూపీ లాగుతున్న అధికారులు మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై రానాకు పలు ప్రశ్నలు సంధించారు. ఎఫ్‌ క్లబ్‌ వ్యవహారాలలో నవదీప్‌, రకుల్‌తో సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story