One Year For Prabhas Saaho: ప్రభాస్ సాహో కి ఏడాది.. ఫ్యాన్స్ కి మెమరీ షేర్ చేసిన ప్రభాస్!

One Year For Prabhas Saaho: రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..

S. Srikanth
Published on: 30 Aug 2020 11:55 AM IST
One Year For Prabhas Saaho: ప్రభాస్ సాహో కి ఏడాది.. ఫ్యాన్స్ కి మెమరీ షేర్ చేసిన ప్రభాస్!
X

One Year For Prabhas Saaho: రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వర్షం, చత్రపతి, బుజ్జిగాడు, డార్లింగ్ ,మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు.. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ స్టామినా ఎక్కడికో వెళ్ళిందని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కుతున్నాయి. గతేడాదిలో సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సాహో బాక్సాఫీస్ ని షేక్ చేసిందనే చెప్పాలి.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమా విడుదలై నేటికి ఏడాది. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్, ప్రభాస్ హీరో హీరొయిన్ గా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన 'సాహో' గత ఏడాది ఆగష్టు 30 2019 లో విడుదలైంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం వంటి బాషలలో ఎన్నో అంచనాతో విడుదలైన ఈ సినిమా కు ఫ్లాప్ టాక్ వచ్చినా.. వసూళ్ళు పరంగా మాత్రం జోరు చూపించింది. సాహో నార్త్ లో రికార్డులు సృష్టించింది.

డైహార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ రచ్చ లేపుతుండగా వారికోసం ప్రభాస్ ఒక పోస్ట్ ను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పెట్టారు. "నా డై హార్డ్ ఫ్యాన్స్ నా చిత్ర యూనిట్ కు సాహో 1 సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా" అని ప్రభాస్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ తో ఇపుడు ప్రభాస్ అభిమానులకు మరింత బూస్టప్ ఇచ్చినట్టు అయ్యింది. అయితే, ఈ సందర్భంగా #1YearForBOMonsterSaaho అనే ట్యాగ్ ను ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story