Hari Hara Veeramallu: పవన్ హీరోయిన్లలో ఒకరు యువరాణి, మరొకరు దొంగ

Hari Hara Veeramallu: One heroine princess, One heroine thief in Pawan Kalyan Movie
x

హరి హర వీర మల్లు సినిమాలో పవన్, నిధీ అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Highlights

Hari Hara Veeramallu: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు.

Hari Hara Veeramallu: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ జాగర్లాముడి ప్రస్తుతం హరి హర వీరమల్లు అనే సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. మహా శివరాత్రి సందర్భంగా, ఫిల్మ్ యూనిట్ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించింది. నిధీ అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నిధీ అగర్వాల్ యువరాణిగా, జాక్వెలిన్ ఈ చిత్రంలో దొంగగా కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్ దొంగగా నటిస్తున్నాడు. అతను కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే పనిలో ఉంటాడని తెలుస్తోంది.

చారిత్రాత్మక చిత్రంగా పేరుపొందిన ఈ సినిమాలో డైలాగ్స్ బుర్రా సాయి మాధవ్ రాస్తున్నారు. చార్మినార్, గోల్కొండ కోటతో పాటు పలు చారిత్రాత్మక ప్రదేశాల సెట్లను ప్రత్యేకంగా భారీ బడ్జెట్ తో వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories