Hero Vishal: షూటింగ్‌లో ప్రమాదం.. హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు

Hero Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరోసారి గాయపడ్డారు.

Arun Chilukuri
Published on: 11 Aug 2022 1:48 PM IST
Once Again Vishal Injured Severely
X

Hero Vishal: షూటింగ్‌లో ప్రమాదం.. హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు

Hero Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరోసారి గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున షూటింగ్ లో ఆయనకు ప్రమాదం జరిగింది. విశాల్ తాజా చిత్రం 'మార్క్ ఆంటొనీ' సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఇటీవలె లాఠీ సినిమా షూటింగ్‌లో విశాల్ రెండుసార్లు గాయపడి తిరిగి కోలుకున్నారు. ఈ మూవీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నపుడు విశాల్ చేతికి గాయమైంది. అనంతరం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యారు విశాల్. విశాల్ చేసిన లాఠీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రస్తుతం మార్క్‌ ఆంటోనీ మూవీ షూటింగులో పాల్గొంటున్నారు విశాల్. తాజాగా గాయాల పాలు కావడంతో ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకోనున్నారని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story