Tamannaah: రామ్ చరణ్ కోసం నెగటివ్ షేడ్స్ చూపించనున్న తమన్నా

Tamannaah: రామ్ చరణ్ కోసం నెగటివ్ షేడ్స్ చూపించనున్న తమన్నా

admin1
Updated on: 17 Aug 2021 1:39 PM IST
Once Again Tamannaah Going to Act With Ram Charan
X

మరోసారి రాంచరణ్ తో కలసి నటించనున్న తామన్నా (ఫైల్ ఇమేజ్)

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా "రచ్చ" సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా సినిమా ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందింది. తాజా సమాచారం ప్రకారం తమన్నా మరొకసారి రామ్ చరణ్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ త్వరలో శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చెర్రీ ఒక ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం మరొక హీరోయిన్ పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమాలో తమన్నా పాత్ర విభిన్నంగా ఉంటుందట. మామూలు హీరోయిన్ పాత్ర లాగా కాకుండా తమన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. తన పాత్ర నిడివి కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే ఉన్నప్పటికీ, ఆమె పాత్ర సినిమాకి హైలైట్ గా ఉంటుందట. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం దర్శక నిర్మాతలు హైదరాబాద్లోనే ఒక భారీ సెట్ ను నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది.

admin1

admin1

Next Story